TGSRTC JOBS: టీజీఎస్ఆర్టీసీలో 3,039 ఉద్యోగాలు...! 4 d ago
TG : టీజీఎస్ఆర్టీసీలో కొత్తగా 3,039 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో అన్నారు. జిల్లా కేంద్రాలకు లింక్ రోడ్లు ఏర్పాటు చేయబోతున్నామని, వేములవాడ, ధర్మపురి, కొండగట్టు క్షేత్రాలను కలుపుతూ బస్సుల లింకింగ్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రాష్ట్ర ఆవిర్భావం సమయంలో ఆర్టీసీలో 55,000 మంది ఉద్యోగులుంటే, ప్రస్తుతం 40,000 మంది ఉన్నారని తెలిపారు. 15 ఏళ్లు దాటిన బస్సులను స్క్రాప్‌కు పంపిస్తున్నామని పేర్కొన్నారు.